మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహణకు పోలీసు అనుమతులతో పాటు మరో తొమ్మిది విభాగాల అనుమతి ..

- March 11, 2016 , by Maagulf
మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహణకు పోలీసు అనుమతులతో పాటు మరో తొమ్మిది విభాగాల అనుమతి ..

: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహణకు పోలీసు అనుమతులతో పాటు మరో తొమ్మిది విభాగాల అనుమతి తప్పనిసరంటూ సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యంగా ఈ మొబైల్ ఫుడ్ కోర్టుల వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా వ్యాపారాన్ని నిర్వహించే వారు తప్పనిసరిగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ నుంచి అనుమతిని తీసుకోవాలని సీపీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. లైట్ మోటర్, మీడియం మోటర్ , హెవీ మోటర్ వెహికిల్‌పై ఫుడ్ కోర్టును నిర్వహించే వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని సీపీ వెల్లడించారు.మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చిందని, ఉల్లంఘిస్తే చర్యలుంటాయని చెప్పారు. కొత్త నిబంధనల వివరాలివి.. స్థానిక ఆర్టీఏ నుంచి ఫుడ్‌కోర్టు యజమానులు తమ వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి. తాజాగా రోడ్డు టాక్స్‌ను కట్టిన రశీదును జత చేయాలి. జీహెచ్‌ఎంసీ, స్థానిక ప్రభుత్వ విభాగాల అనుమతి తీసుకోవాలి. నిబంధనల ప్రకారం ఆహార నాణ్యతను పాటించాలి. ట్రేడ్ లైసెన్స్‌లను తీసుకోవాలి. జీహెచ్‌ఎంసీ అనుబంధ సంస్థ విభాగం ఆరోగ్య డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌వోసీ పొందాలి. వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ, తప్పని సరిగా కమర్షియల్ సిలిండర్ల వాడకం. గ్యాస్, ఎలక్ట్రీక్ సేఫ్టీ సర్టిఫికెట్.వ్యాపారాన్ని నిర్వహించే ప్రాంతానికి సంబంధించిన లోకేషన్‌ను మ్యాప్‌ను పొందుపర్చడం ఫుడ్ కోర్టు వాహనాలు ప్రధాన రోడ్డుకు 60, 100 అడుగులో దూరంలోనే పెట్టుకోవడం వంటి నిబంధనలు పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com