'రాధే శ్యామ్' విడుదల తేదీ ఖరారు
- July 30, 2021
హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. తాజాగా ఆయన అభిమానులను సప్రైజ్ చేసే న్యూస్ ఒకటి వచ్చింది. 'రాధే శ్యామ్' మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలకానుందని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' రూపొందుతుంది. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
గోపీకృష్ణ మూవీస్..యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం.మరో మూడు ప్యాన్ ఇండియన్ మూవీలతో ప్రభాస్ బీజీగా ఉన్నారు. ప్రభాస్ నాగ్ ప్రధాన పాత్రలో అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నారు.ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ప్రభాస్ మూవీ ఓకే అయింది. ఈ మూవీకి సలార్ అనే టైటిల్ కన్ఫాం చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయింది. రెండు పార్టులుగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. వాణీ కపూర్ , శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







