జనసేన సాహసవీరునికి ఖతార్ సేన అభినందనలు

- July 30, 2021 , by Maagulf
జనసేన సాహసవీరునికి ఖతార్ సేన అభినందనలు

దోహా: ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారోను అధిరోహించి జనసేన జండా ఎగురవేసిన దిరిసెల మల్లికార్జున రావు కి ఖతార్ గల్ఫ్ సేన జనసేన తరఫున అభినందనలు తెలిపారు.ఖతార్ జనసేన కార్యవర్గ సభ్యులైన వీర బాబు,శ్రీకాంత్ కొమ్ముల, సత్యం మెడిద, జి.కె. దోర,కింగ్ రాజు,గౌతమ్ కొమ్మిసెట్టి,కోటి,జానకి రామ్ మరియు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.మల్లికార్జున రావు చేసిన ఈ పర్వతారోహణ కార్యక్రమం ఎందరో జన సైనికులకు స్ఫూర్తి ని ఇచ్చిందన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com