నటుడిగా ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చిన దర్శకేంద్రుడు..
- July 30, 2021
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెలుగు సినిమాను అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. తన సినిమాల్లో హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడికి మరెవరు సాటి రారు. కమర్షియల్ మూవీస్, భక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కె.రాఘవేంద్రరావు తన 45 ఏళ్ళ కెరీర్‌లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కనీసం గెస్ట్ రోల్ కూడా వేయలేదు. తన తోటి దర్శకులు నటులుగా అతిథి పాత్రల్లో కనిపించినా.. ఆయన మాత్రం అసలు ఆసక్తి చూపించలేదు.
మెగాఫోన్ చేతపట్టి తెరవెనక మాత్రమే ఉండే ఈ మౌన ముని.. ఇప్పుడు తెరముందుకు వచ్చారు. రాఘవేంద్రరావు తొలిసారిగా సినిమాలో నటించడం సినీ అభిమానులకు ఆశ్చర్యపోయేలా చేసింది. నిన్నమొన్నటి వరకు కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవారు కాదు. ఓ ప్రైవేట్ చానల్ లో స్పెషల్ గా ఒక షో ఏర్పాటు చేసి దాని ద్వారా తన స్టార్స్ తో కలిసి మ్యాజిక్ చేశారు. రాఘవేంద్రరావు తన శైలికి భిన్నంగా ఇప్పుడు ఆన్ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా పెళ్లిసందD. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు ఓ సీన్ లో దర్శనమిచ్చారు. ఈ సినిమాలో ఆయన వశిష్ట అనే పాత్రలో నటిస్తున్నట్లు పెళ్లిసందD టీం అధికారికంగా ప్రకటించింది. రాఘవేంద్రుడికి సంబంధించిన ఓ నిమిషం నిడివిగల ప్రోమో రిలీజ్ చేసింది. ఇప్పుడది నెట్టింట్లో వైరల్ అయింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









