యూఏఈలో వైద్యులకు గొప్ప అవకాశం
- July 30, 2021
యూఏఈ: యూఏఈ వైద్యులకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది.పదేళ్ల కాలపరిమిత గల గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.యూఏఈ హెల్త్ అథారిటీ లైసెన్స్ గల వైద్యులు జూలై 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ http://smartservices.ica.gov.ae ద్వారా వైద్యులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించించారు.దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులైన వారిని గుర్తించి గోల్డెన్ వీసా మంజూరు చేస్తామని పేర్కొంది.
దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.దీనివల్ల అధిక నైపుణ్యం గల వైద్యులు తమ దేశానికి సేవ చేసే వీలు ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఇక వివిధ రంగాల్లో దేశానికి విశేష కృషి చేసిన వ్యక్తులకు యూఏఈ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పరిమితితో గోల్డెన్ వీసా జారీ చేస్తోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







