ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధాని మోడీ ప్రసంగం
- July 31, 2021
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో వర్చువల్ సమావేశంలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మాట్లాడారు.భారత దేశంలో పోలీసు వ్యవస్థపై వ్యతిరేక అభిప్రాయం ఉందని, ఈ వ్యవస్థ ప్రతిష్ఠను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు.కోవిడ్-19 మహమ్మారి ప్రారంభంలో ఈ వ్యతిరేక ప్రజాభిప్రాయం తాత్కాలికంగా మారిందని చెప్పారు. అయితే మళ్ళీ పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయన్నారు.
భారత దేశం ప్రస్తుతం చరిత్రలో చాలా ముఖ్యమైన దశలో ఉందని చెప్పారు. ఇటువంటి సమయంలో పోలీసులు తమ వ్యవస్థ పేరు, ప్రతిష్ఠలు మెరుగుపడటానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తు స్పందన దళం (NDRF)ను ఉదాహరణగా చూపించారు. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది అందజేసే సేవలపై ప్రజలకు గొప్ప నమ్మకం ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా ఐపీఎస్ ట్రైనీలు పోలీస్ అకాడమీలో తమ అనుభవాలను మోడి కి వివరించారు. ప్రొబేషనర్లతో మోడి మాట్లాడుతూ వారి అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ అధికార పరిధిలోని భద్రతా పరిస్థితులతో ఏ విధంగా వ్యవహరించాలనుకుంటున్నదీ అడిగారు. వ్యక్తిత్వ లక్షణాలు, నేపథ్యాల నుంచి వచ్చిన అనుభవం వంటివాటిని ఉపయోగించి ఏ విధంగా పని చేస్తారో అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









