రాచకొండ,సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం
- July 31, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటంచిన PRC-2020 జీత,భత్యాలను సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ లోని పోలీసు సిబ్బంది మొత్తానికి (సుమారుగా 10,400 మందికి) జూన్ నెల ఏరియర్స్ అందించి, జూలై 2021 కొత్త జీతాన్ని అందిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కి, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కి రాచకొండ, సైబరాబాద్ పోలీసుల వారి తరుపున పోలీసు అధికారుల సంఘం వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పిఆర్సి–2020 జీత, భత్యాలను సిబ్బందికి అందజేయాలని రాచకొండ,సైబరాబాద్ సీపీల ఆదేశాలతో సైబరాబాద్ డీసీపీ అనసూయ, రాచకొండ డీసీపీ శిల్పవల్లి వారి పర్యవేక్షణలో గతకొద్ది రోజుల నుండి నిరంతరం శ్రమించిన రాచకొండ చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్ సుగుణ, సైబరాబాద్ చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్ చంద్ర కళ, సైబరాబాద్ అసిస్టెంట్ అక్కౌంట్స్ ఆఫీసర్ ధర్మరాజ్, రాచకొండ అక్కౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్,సైబరాబాద్ జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ మధులత,రాచకొండ జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ అనిల్ మరియు వారి సిబ్బంది రాచకొండ, సైబరాబాద్ పోలీసు వారికి సకాలములో పిఆర్సి 2020 ఫలాలు మంజూరు చేసినందుకు సైబరాబాద్ పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









