టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించిన జపాన్
- July 31, 2021
టోక్యో: జపాన్ లో తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.ఇప్పటికే టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌కు సైతం కరోనా సెగ తగిలింది.పలువురు క్రీడాకారులు కరోనబారినపడ్డారు.అయితే, కరోనా కల్లోలం సృష్టించడంతో జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.. క్యాపిటల్ సిటీ టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది జపాన్.. టోక్యో, సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్ధితిని ప్రకటించినట్టు ప్రధాని సుగ కార్యాలయం వెల్లడించింది.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని.. ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం.. తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని పీఎంవో పేర్కొంది.. ఆగస్టు 31వ తేదీ వరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.. ఇక, హక్కైడో, ఇషికావా, క్యోటో, హ్యోగో, ఫుకుయోకా లాంటి ప్రాంతాల్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య గత వారంలో 10 శాతం పెరిగింది, ఎక్కువగా ఏప్రిల్ చివరి నుండి జూన్ మధ్యలో మందగించిన కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి.. అందుకు డెల్టా వేరియంట్ కూడా కారణమే.. ఆసియా-పసిఫిక్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది-వియత్నాం మరియు జపాన్‌లో రోజువారీ కేసులలో 61 శాతం పెరుగుదలను నమోదు చేస్తున్నాయి.. యూఎస్, కెనడాలో 57 శాతం ఎక్కువ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







