ఏపీ కరోనా అప్డేట్

- August 05, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 82,297 నమూనాలు పరీక్షించగా.. 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 428 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత చిత్తూరు జిల్లాలో 369, నెల్లూరు జిల్లాలో 304 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 2,003 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,42,371కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 24 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19,76,141 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com