తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- August 05, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది.మరోసారి 600కు దిగువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 582 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.ఇక, ఒకేరోజు 638 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,811కు చేరుకోగా…రికవరీ కేసుల సంఖ్య 6,35,250కు పెరిగింది.మరోవైపు.. ఇప్పటి వరకు 3,817 మంది కోవిడ్ బాధితులు రాష్ట్రంలో మృతిచెందారు.రికవరీ రేటు రాష్ట్రంలో 98.06 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 8,744 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,07,329 శాంపిల్స్‌ను పరీక్షించారు అధికారులు. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 83, కరీంనగర్లో 61, వరంగల్ అర్బన్‌లో 61 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్‌లో ఉచిత OTT వినోదం!









