30% సామర్ధ్యంతో సినిమా థియేటర్లకు పర్మిషన్

- August 06, 2021 , by Maagulf
30% సామర్ధ్యంతో సినిమా థియేటర్లకు పర్మిషన్

బహ్రెయిన్: కోవిడ్ తో మూతపడిన సినిమాథియేటర్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. థియేటర్ల ప్రారంభానికి బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోనేందుకు ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్..గవర్నమెంట్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ అప్రూవల్ మేరకు ఈ ప్రకటన వెలువరించింది. 30 శాతం సామర్ధ్యంతో థియేటర్లలో స్క్రీనింగ్ ప్రారంభించొచ్చని టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది. అయితే..కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించితీరాలని హెచ్చరించింది. అంతేకాదు..కోవిడ్ కేసులు..తాజా గణాంకాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుతుంటాయని కూడా వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com