క్వారంటైన్ నిబంధనలు పాటించని 60 మంది అరెస్ట్
- August 06, 2021
సౌదీ: క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన 60 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైరస్ ఇన్ ఫెక్షన్ సోకినట్లు పీసీఆర్ టెస్ట్ రిపోర్టులో నిర్ధారణ అయిన తర్వాత కూడా పేషెంట్లు జనాల్లో తిరగటం సమాజ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టడమే అని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా పలు చోట్ల చేపట్టిన సోదాల్లో మొత్తం 60 మంది వయోలేటర్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.ఇక పీసీఆర్ పాజిటీవ్ రిపోర్ట్ తో షాపింగ్ మాల్ లో కలియతిరిగిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఫోకస్ చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి అరెస్టైన వారి సంఖ్య 61కి పెరిగింది. అరెస్టైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని..SR500000 మించకుండా జరిమానా, ఐదేళ్లకు మించకుండా జైలుశిక్ష..నేర తీవ్రతను బట్టి రెండు శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







