క్వారంటైన్ నిబంధనలు పాటించని 60 మంది అరెస్ట్

- August 06, 2021 , by Maagulf
క్వారంటైన్ నిబంధనలు పాటించని 60 మంది అరెస్ట్

సౌదీ: క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన 60 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైరస్ ఇన్ ఫెక్షన్ సోకినట్లు పీసీఆర్ టెస్ట్ రిపోర్టులో నిర్ధారణ అయిన తర్వాత కూడా పేషెంట్లు జనాల్లో తిరగటం సమాజ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టడమే అని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా పలు చోట్ల చేపట్టిన సోదాల్లో మొత్తం 60 మంది వయోలేటర్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.ఇక పీసీఆర్ పాజిటీవ్ రిపోర్ట్ తో షాపింగ్ మాల్ లో కలియతిరిగిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఫోకస్ చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి అరెస్టైన వారి సంఖ్య 61కి పెరిగింది. అరెస్టైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని..SR500000 మించకుండా జరిమానా, ఐదేళ్లకు మించకుండా జైలుశిక్ష..నేర తీవ్రతను బట్టి రెండు శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com