రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, ఈవెంట్లకు మరిన్ని సడలింపులు
- August 09, 2021
యూఏఈ: కోవిడ్ ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తూ వస్తున్న యూఏఈ లేటెస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, కేఫ్ లు, ఈవెంట్లు, వివాహాలకు మరిన్ని సడలింపులు ప్రకటించింది. రెస్టారెంట్లు, కేఫ్ లలో 80 శాతం మందికి అనుమతి ఇచ్చింది. ఒక్క టేబుల్ పై పది మంది వరకు కూర్చొవచ్చు. అయితే..తమ టేబుల్ పక్కకు రాగానే విధిగా మాస్కులు ధరించాల్సిందే. అలాగే రెస్టారెంట్లు, కేఫ్ సిబ్బంది వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయిన్టేన్ చేస్తూ ఫేస్ మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. ఇక ఈవెంట్లలో 60 శాతం మందికి అనుమతి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టులలో అనుమతి సామర్ధ్యాన్ని 75 శాతానికి పెంచింది.పెళ్లిళ్లకు పూర్తి సామర్ధ్యంలో 60 శాతం మంది హజరుకావొచ్చు. అయితే..గరిష్టంగా 300 మందికి మించి ఉండకూడదు. అంటే పెళ్లి వేదిక పూర్తి సామర్ధ్యంలో 60 శాతంగానీ, లేదంటే గరిష్టంగా 300 మందికిగానీ అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







