హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు
- August 09, 2021
హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) స్కైట్రాక్స్ ప్రపంచ ఎయిర్ పోర్ట్స్ అవార్డులు-2021లో ‘బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఇండియా & సెంట్రల్ ఏషియా’ అవార్డును గెల్చుకుంది.హైదరాబాద్ విమానాశ్రయం స్కైట్రాక్స్ అవార్డును గెల్చుకోవడం వరుసగా ఇది మూడోసారి.అలాగే ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాలలో గత ఏడాది 71వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 64వ స్థానానికి చేరింది.హైదరాబాద్ విమానాశ్రయం ఈ క్రింది విభాగాలలో కూడా అవార్డులు గెల్చుకుంది:
· భారతదేశం, సెంట్రల్ ఏషియాలో అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయం – 3వ ర్యాంకు
· భారతదేశం, సెంట్రల్ ఏషియాలో బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ - 4వ ర్యాంకు
· ఏషియాలో బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ - 6వ ర్యాంకు
స్కైట్రాక్స్ కొన్ని నెలల క్రితం చాలా విస్తృతంగా ఆన్‌లైన్ ద్వారా చేపట్టిన ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ సర్వేను సమీక్షించిన తర్వాత ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రపంచ ఎయిర్‌పోర్టులలో నాణ్యతకు స్కైట్రాక్స్ అవార్డులను గీటురాయిగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 550కి పైగా విమానాశ్రయాలలో కస్టమర్ సేవలను, సౌకర్యాలను పరిశీలించిన అనంతరం వీటిని విడుదల చేస్తారు.
_1628498225.jpg)
ఈ ఫలితాలపై ప్రదీప్ పణికర్, సీఈఓ, జీహెచ్‌ఐఎఎల్, ‘‘ఈ మహమ్మారి సమయంలో అచంచలమైన నిబద్ధతతో పని చేసిన హైదరాబాద్ విమానాశ్రయ సిబ్బంది, వాటాదారులు, భాగస్వాములందరికీ ఈ అవార్డు అంకితం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే మా వినూత్న, సాంకేతిక పరిష్కారాలు ఈ విజయానికి దోహదమయ్యాయని భావిస్తున్నాం. ప్రయాణీకులందరికీ మరింత సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు, మా నిబద్ధతను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ గుర్తింపు ప్రేరేపిస్తుంది.’’ అన్నారు.
GMR నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఈ ప్రతిష్టాత్మక అవార్డులలో మరొక ప్రధాన విజేతగా నిలిచింది.స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులు 2021లో వరుసగా మూడో ఏడాది ఢిల్లీ విమానాశ్రయం 'బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా' ఎంపికైంది. 2020లో 50వ స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం 2021లో 45వ స్థానానికి చేరుకుని ప్రపంచంలోని టాప్-50 ఎయిర్‌పోర్టులలో చేరింది. కోవిడ్ మహమ్మారి సమయంలో భద్రతా ప్రోటోకాల్‌లను పాటించినందుకు DIAL కి 'COVID-19 ఎయిర్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు' కూడా లభించింది. ఈ కేటగిరీలో భారతదేశంలోని ఏకైక విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది.
_1628498307.jpg)
భారతదేశంలోని ముంబై, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాలు, మధ్యఆసియాలో కొలంబో విమానాశ్రయాలను వెనక్కి నెట్టి, ఢిల్లీ విమానాశ్రయం మొదటి ర్యాంకును పొందగా, హైదరాబాద్ విమానాశ్రయం 'బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా' విభాగంలో రెండో ర్యాంకు పొందింది.
విమానాశ్రయ పరిశ్రమలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. వీటిని కస్టమర్‌లు వార్షిక గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ సర్వే ద్వారా ఎన్నుకుంటారు. ఈ అవార్డులను 550 విమానాశ్రయాలలో కస్టమర్ సేవ మరియు సౌకర్యాలను అంచనా వేస్తూ, ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమకు నాణ్యమైన బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తారు. ఈ సర్వే, అవార్డులు ఏ విమానాశ్రయ నియంత్రణకూ లోబడకుండా స్వతంత్రంగా నిర్వహించబడతాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









