యూఏఈ ఫిట్టెస్ట్ ఫిమేల్ ఖాతాలో 3 ప్రపంచ రికార్డులు
- March 12, 2016
యూఏఈ ఫిట్టెస్ట్ మహిళ ఇవా క్లార్క్ తాజాగా రెండు గిన్నీస్ రికార్డ్స్‌ని సొంతం చేసుకున్నారు. 12 గంటల్లో అలాగే 24 గంటల కేటగిరీస్‌లో ఎక్కువ పుల్ అప్స్ తీసిన మహిళగా రికార్డులు సాధించారు ఇవా క్లార్క్. కేవలం ఆరు గంటల 30 నిమిషాల్లో 2,740 పుల్ అప్స్ తీసిన క్లార్క్, గతంలో 12 గంటల్లో తీసిన 2740 పుల్‌అప్స్ రికార్డ్‌ని బ్రేక్ చేశారు. 24 గంటల్లో 3500 పుల్ అప్స్ తీసిన గత రికార్డ్‌ని కూడా ఆమె బ్రేక్ చేశారు. 24 గంటల్లో క్లార్క్ 3,737 పుల్ అప్స్ తీసి రికార్డు సృష్టించారు. కేవలం గంట వ్యవధిలో 725 పుల్ అప్స్ తీసి, గతంలో ఉన్న 700 పుల్ అప్స్ రికార్డ్‌ని కూడా ఆమె తిరగరాశారు. ఏడుసార్లు ఇలాంటి రికార్డుల్ని క్లార్క్ సొంతం చేసుకున్నారు. క్లార్క్ సమాజం పట్ల కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. అనేక సేవా కార్యక్రమంలో పాల్గొని మేటి మహిళ అనిపించుకున్నారామె.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







