ఆన్ లైన్ మోసాల ముఠా గుట్టురట్టు..8 మంది అరెస్ట్

- August 10, 2021 , by Maagulf
ఆన్ లైన్ మోసాల ముఠా గుట్టురట్టు..8 మంది అరెస్ట్

రియాద్: మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మీ డబ్బులు అధిక రాబడులు ఇచ్చే షేర్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే..మమ్మల్ని సంప్రదించండి. ఇలాంటి ప్రకటనలతో అమాయకులైన వారిని నమ్మించి వారి నుంచి డబ్బులు కాజేస్తున్న ఆన్ లైన్ చీటింగ్ ముఠాను రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మంది సభ్యులు ఉన్న ఈ ముఠా ఇప్పటివరకు 100కుపైగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు సౌదీ పౌరులు. మిగిలిన ఐదుగురిలో ముగ్గురు ఈజిప్షయన్లు, ఒకరు ఇండియన్, మరొకరు పాకిస్తానీ ఉన్నారు. ఆన్ లైన్ మోసాలలో వీరికి ఇతర దేశాల నుంచి కూడా సాయం అందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆకర్షించేలా బోగస్ ప్రకటనలు ఇస్తూ ప్రజలను బురిడికొట్టిస్తుంటారు. పెట్టుబడులు, షేర్లు, కింగ్డమ్ వెలుపల ప్రభుత్వం అందించే సేవలు ఇలా వివిధ రూపాల్లో వీరి బోగస్ ప్రకటనలు ఉంటాయి. తమను సంప్రదించే వారితో మాట్లాడేందుకు ఏకంగా 1300 సిమ్ కార్డులను వినియోగించారు. బాధితులు పంపే డబ్బులు జమ చేసేందుకు బ్యాంక్ అకౌంట్లను కూడా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.  నిందితులను చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించామని పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com