టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం
- August 11, 2021
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. కాగా టీటీడీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించినట్లు ఏపీ ప్రభుత్వం త్వరలో టీటీడీ బోర్డు సభ్యులను నియమిస్తామని ఇటీవల ప్రకటించింది. 2019 జూన్ 21న టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూన్ 21వ తేదీకి ముగిసింది. దీంతో టీటీడీ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







