5 రోజుల్లో 242 మంది చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్

- August 11, 2021 , by Maagulf
5 రోజుల్లో 242 మంది చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు చెబుతున్నారు.. పాజిటివ్‌గా తేలినవారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్లవారు 136 మంది ఉన్నారు.. బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక, కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు ఉండడం.. ఈసారి చిన్నారులపైనే అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో.. ఐదు రోజుల్లోనే పెద్ద సంఖ్యలో చిన్నారులు కోవిడ్ బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది.. దీంతో అప్రమత్తమైన అధికారులు చిన్నారులను ఇళ్లలోనే ఉంచాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com