హిమాచల్‌లో కొండ చరియలు విరిగి పడి 11 మంది మృతి
- August 11, 2021
హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మృతి చెందారు. 30 మంది బురదలో చిక్కుకున్న వాహనాల్లో ఉంటారని అంచనా. ఈ ఘటన కిన్నౌర్‌లో ని రెక్‌కాంగ్ పియో- సిమ్లా హైవేలో బుధవారం మధ్యాహ్నం కొండ చరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తుతుండటంతో కొండ ప్రాంతాల్లో రాళ్లు కిందకు పడుతున్నాయి. ట్రక్కుతో పాటు రాష్ట్ర బస్సు, ఇతర వాహనాలు ఈ శిథిలాల కింద చిక్కుకుని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సిమ్లాకు వెళుతున్న బస్సులో సుమారు 40 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...25-30 మంది శిథిలాల కింద ఉంటారని చెబుతున్నారు. డ్రైవర్‌తో సహా 10 మందిని రక్షించినట్లు తెలిపారు. పెద్ద పెద్ద రాళ్లు కిందకు దొర్లినట్లు ఓ వీడియోలో కనిపిస్తున్నాయి. ఘటనా స్థలికి ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ఎన్‌డిఆర్‌ఎఫ్) కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయని ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తెలిపారు.
స్థానిక పాలనాయంత్రాంగంతో పాటు పోలీసులను రక్షణ చర్యలకు ఆదేశించినట్లు చెప్పారు. ఒక బస్సు, కారుపై కొండచరియలు విరిగి పడ్డాయని సమాచారం అందిందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడి...అవసరమైన సాయాన్ని అందిస్తామని హామీనిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







