6 గం.ల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి..UAE ప్యాసింజర్లకు గైడ్ లైన్స్

- August 12, 2021 , by Maagulf
6 గం.ల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి..UAE ప్యాసింజర్లకు గైడ్ లైన్స్

న్యూఢిల్లీ: భారత్ నుంచి యూఏఈ చేరుకునే ప్రయాణికులు ఖచ్చితంగా తమ ఫ్లైట్ టైం కంటే 6 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి. ఎమిరేట్స్ కొత్త మార్గనిర్దేశకాల అనుసారంగా ఈ కొత్త సూచనలు చేస్తున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది. ఎమిరేట్స్ గైడ్ లైన్స్ మేరకు ఇండియాలోని ఏ ఎయిర్ పోర్టు నుంచి అయినా యూఏఈ వెళ్లే ప్రయాణికులకు ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఆ తర్వాతే ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించాలి. అంటే ప్రతి ప్రయాణికుడు ఫ్లైట్ బయల్దేరే టైం కంటే 6 గంటల ముందు ఎయిర్ పోర్టుకు చేరుకొని...అక్కడి ర్యాపిడ్ టెస్ట్ కౌంటర్లలో టెస్ట్ చేయించుకోవాలి. ఫ్లైట్ టైంకి నాలుగు గంటల ముందు ర్యాపిడ్ టెస్ట్ కౌంటర్లను తెరుస్తారు. ఫ్లైట్ టైంకి రెండు గంటల ముందు కౌంటర్ క్లోజ్ చేస్తారు. ఆ వెంటనే టెస్ట్ రిపోర్టులు అందిస్తారు. నెగటీవ్ రిజల్ట్ వచ్చిన వారికి మాత్రమే ఫ్లైట్లోకి అనుమతించనున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com