కమ్యూనిటీ సెంటర్లను సందర్శించిన మనామా గవర్నర్

- August 12, 2021 , by Maagulf
కమ్యూనిటీ సెంటర్లను సందర్శించిన మనామా గవర్నర్

బహ్రెయిన్: మనామా గవర్నర్ షేక్ హేషం బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా రాజధానిలోని అనేక కమ్యూనిటీ సెంటర్లను(మతామ్‌లు) సందర్శించారు.అశూర సీజన్‌లో సౌకర్యాలకు సంబంధించి కమ్యూనిటీ సెంటర్లలో ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు.హుస్సేన్యా ఊరేగింపుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని పలు సూచలను చేశారు. అంతర్గత మంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆచారాలను పాటిస్తూ హుస్సేన్యా ఊరేగింపును సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అధికారులను సమన్వయం చేసుకునేలా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆచారబద్ధంగా అంతా సక్రమకంగా జరిగేలా కమ్యూనిటీ సెంటర్ల అధిపతులు..అధికారులు కృషి చేయాలన్నారు. అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కమ్యూనిటీ సెంటర్ల అధిపతులతో పాటు ప్రజలను ఆయన కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com