40 లక్షల మార్క్ చేరుకున్న వ్యాక్సినేషన్
- August 12, 2021
ఖతార్: కోవిడ్ ఎదుర్కునేందుకు కమ్యూనిటీ ఇమ్యూనిటీ ప్రోగ్రాంను ముమ్మరం చేసిన ఖతార్..నిన్నటితో 40 లక్షల మైలు రాయి చేరుకుంది. ఖతార్ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 40,12,536 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు గణాంకాలతో వివరించింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హత ఉన్న(12 ఏళ్లు పైబడిన వారు) వారిలో దాదాపుగా 88.8 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని స్పష్టం చేసింది. 74.9 శాతం మందికి రెండు డోసులు అందాయని తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 21,570 మందికి వ్యాక్సిన్ అందించారు. సమాజంలోని ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకొని బాధ్యతాయుతంగా మసలుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







