మిజోరాంలో 128 మంది పిల్లలకు కోవిడ్

- August 12, 2021 , by Maagulf
మిజోరాంలో 128 మంది పిల్లలకు కోవిడ్

మిజోరాం: పిల్లలపై కోవిడ్ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం మిజోరాంలో 576 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో 128 మంది చిన్నారులే ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.తాజాగా ఈ మహమ్మారి బారిన పడినవారిలో చిన్నారులతో పాటు ఎనిమిది మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కోవిడ్ థర్డ్ వేవ్‌..చిన్న పిల్లలకు ప్రమాదకరమని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో.. కర్ణాటక, మిజోరం రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com