టెక్ మహింద్ర లో ఉద్యోగాలు.!
- August 12, 2021
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల అవుతూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహింద్ర సంస్థ (Tech Mahindra)లో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2015-2020 సంవత్సరాల్లో పాసై ఉండాలి. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.50 లక్షలు అందించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అయితే అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నైపుణ్యం సాధించి ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ ఉండాలి. డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ ఉండాలి.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







