తెలంగాణలో జిల్లా జడ్జిల బదిలీలు
- August 12, 2021
తెలంగాణలో భారీగా జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నత కల్పించింది.
సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఆర్.తిరుపతి, హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా జీవీ సుబ్రమణ్యం, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జిగా ఎ.వీరయ్య నియమితులయ్యారు. సీనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, పి.లక్ష్మీ కుమారి, జి.సునీత రవీంద్రరెడ్డి, సి.పావని, ఎం.శరత్ కుమార్, ఎన్.రోజా రమణి, టి.అనిత, మహ్మద్ అఫ్రొజ్ అఖ్తర్, కె.ఉమాదేవి, బి.అపర్ణదేవి, సీహెచ్.పంచాక్షరి, బి.తిరుపతి, జె.కవిత, టి.సుహాసినిలకు జిల్లా జడ్జిలుగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ హైకోర్టు పోస్టింగులు ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







