ఎతిసలాత్ కస్టమర్లకు ఊరట..బిల్లు చెల్లింపులకు 15 రోజుల గడువు
- August 13, 2021
యూఏఈ: యూఏఈ టెలికాం దిగ్గజం ఎతిసలాత్ తమ వినియోగదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ప్రతీ నెల ఒకటో తేదీన జనరేట్ అయ్యే బిల్లుల చెల్లింపులకు 15 రోజుల గ్రేస్ పిరీయడ్ ప్రకటించింది. దీంతో బిల్లుల చెల్లింపులకు కస్టమర్లకు తగినంత సమయం దొరుకుంది. అంతేకాకుండా గడువు లోగానే బిల్లులు చెల్లింపుల ద్వారా రీకనెక్షన్ ఫీజు DH26.25తో పాటు ఐదు శాతం వ్యాట్ నుంచి బయటపడొచ్చు. లేట్ పేమెంట్ ఫైన్, రీకనెక్షన్ ఫీజుల నుంచి తప్పించుకునేందుకు వినియోగదారులు గడువులోగానే బిల్లులను చెల్లించాలని, అవసరం అనుకుంటే క్రెడిట్ కార్డు నుంచి ఆటోమెటిగ్గా బిల్లులను చెల్లించేలా ఆటో పేమెంట్ సర్వీస్ ను వినియోగించుకోవాలని ఎతిసలాత్ వినియోగదారులకు సూచించింది.
ఇదిలాఉంటే..టెలికాం రంగంలో రోజురోజుకు జరుగుతున్న అభివృద్ధి కారణంగా పాతతరం సిగ్నల్ సేవలకు స్వస్తి పలకనున్నట్లు కూడా ఎతిసలాత్ స్పష్టం చేసింది. టెలికమ్యూనికేషన్స్& డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ-TDRAకి అనుగుణంగా 2022 చివరి నాటికి తమ 2G నెట్వర్క్ క్రమంగా స్విచ్ ఆఫ్ చేయబడుతుందని ఎతిసలాట్ తెలిపింది. అయితే..2G వినియోగదారులను 4G/5Gకి అప్ గ్రేడ్ చేసేలా అల్టర్నేట్ డివైజ్ లు అందించనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!







