నివాసాల మధ్యకు సింహం..బంధించిన అధికారులు
- August 13, 2021
రియాద్: ఎలా వచ్చిందో తెలియదు ఓ సింహం రియాద్ లో జనావాసాల మధ్యకు వచ్చేసింది. మృగరాజు నడిరోడ్డుపై తిరుగుతుండే సరికి ప్రజలు అప్రమత్తం అయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ భద్రత కోసం ప్రత్యేక దళాలు-SFES చాకచక్యంగా సింహాన్ని బంధించి నేషనల్ వైల్డ్ లైఫ్ డెవలప్మెంట్ సెంటర్ కు తరలించారు. తమకు నేషనల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ నుంచి సింహం జనావాసాల మధ్యకు వచ్చినట్లు రిపోర్ట్ వచ్చిందని..సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు SFES అధికారులు వెల్లడించారు. అయితే..దీనికి బాధ్యులైన వారిని గుర్తుంచేందుకు విచారణ జరుగుతోందన్నారు. పర్యావరణ నిబంధనల ప్రకారం బధ్యుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష, SR30 మిలియన్ వరకు జరిమానా లేదా జైలుశిక్ష, జరిమానా రెండు విధించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!







