నివాసాల మధ్యకు సింహం..బంధించిన అధికారులు

- August 13, 2021 , by Maagulf
నివాసాల మధ్యకు సింహం..బంధించిన అధికారులు

రియాద్: ఎలా వచ్చిందో తెలియదు ఓ సింహం రియాద్ లో జనావాసాల మధ్యకు వచ్చేసింది. మృగరాజు నడిరోడ్డుపై తిరుగుతుండే సరికి ప్రజలు అప్రమత్తం అయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ భద్రత కోసం ప్రత్యేక దళాలు-SFES చాకచక్యంగా సింహాన్ని బంధించి నేషనల్ వైల్డ్ లైఫ్ డెవలప్మెంట్ సెంటర్ కు తరలించారు. తమకు నేషనల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ నుంచి సింహం జనావాసాల మధ్యకు వచ్చినట్లు రిపోర్ట్ వచ్చిందని..సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు SFES అధికారులు వెల్లడించారు. అయితే..దీనికి బాధ్యులైన వారిని గుర్తుంచేందుకు విచారణ జరుగుతోందన్నారు. పర్యావరణ నిబంధనల ప్రకారం బధ్యుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష, SR30 మిలియన్ వరకు జరిమానా లేదా జైలుశిక్ష,  జరిమానా రెండు విధించే అవకాశాలు ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com