ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- August 13, 2021
న్యూ ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.అందులో 55 తుపాకులు, 50 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్ లు ఉన్నాయి.ఈ నలుగురు ఆయుధాల అక్రమ రవాణా ముఠా సభ్యులుగా భావిస్తున్నారు.
అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీ వాసి కాగా, మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. డ్రోన్లు, బెలూన్లపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







