బయటి ప్రాంతాల్లో పని చేస్తున్నకార్మికులకు గొడుగులు, చల్లటి నీరు అందించిన అబుధాబి పోలీస్
- August 14, 2021
అబుధాబి: అబుధాబి పోలీస్ హ్యాపీనెస్ పెట్రోల్, మినీ అంబ్రెల్లాస్ (చిన్నపాటి గొడుగులు) అలాగే చల్లటి నీరుని బయటి ప్రాంతాల్లో (ఔట్‌డోర్) పనిచేసే కార్మికులకు అందించారు. వేసవి ఎండ నుంచి వారికి ఇవి కాస్త రక్షణగా పనికొస్తాయి. మానవీయ కోణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘వియ్ ఈజ్ దెయిర్ సఫరింగ్’ (వారి సమస్యల్ని మా సాయం) అనే పేరు పెట్టారు.అబుధాబి ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కష్టమైన పరిస్థితుల్లో పని చేస్తున్న కార్మికులకు తమవంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా కార్యక్రమాన్నే అల్ అయిన్ ప్రాంతంలో చేపట్టారు. యాంటీ నార్కోటిక్స్ డిపార్టుమెంట్ ’మేక్ ఇట్ కూల్ టు దెబమ్’ అనే పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







