బయటి ప్రాంతాల్లో పని చేస్తున్నకార్మికులకు గొడుగులు, చల్లటి నీరు అందించిన అబుధాబి పోలీస్

- August 14, 2021 , by Maagulf
బయటి ప్రాంతాల్లో పని చేస్తున్నకార్మికులకు గొడుగులు, చల్లటి నీరు అందించిన అబుధాబి పోలీస్

అబుధాబి: అబుధాబి పోలీస్ హ్యాపీనెస్ పెట్రోల్, మినీ అంబ్రెల్లాస్ (చిన్నపాటి గొడుగులు) అలాగే చల్లటి నీరుని బయటి ప్రాంతాల్లో (ఔట్‌డోర్) పనిచేసే కార్మికులకు అందించారు. వేసవి ఎండ నుంచి వారికి ఇవి కాస్త రక్షణగా పనికొస్తాయి. మానవీయ కోణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘వియ్ ఈజ్ దెయిర్ సఫరింగ్’ (వారి సమస్యల్ని మా సాయం) అనే పేరు పెట్టారు.అబుధాబి ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కష్టమైన పరిస్థితుల్లో పని చేస్తున్న కార్మికులకు తమవంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా కార్యక్రమాన్నే అల్ అయిన్ ప్రాంతంలో చేపట్టారు. యాంటీ నార్కోటిక్స్ డిపార్టుమెంట్ ’మేక్ ఇట్ కూల్ టు దెబమ్’ అనే పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com