ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేడి జులై నెలలోనే

- August 14, 2021 , by Maagulf
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేడి జులై నెలలోనే

అమెరికా సైంటిఫిక్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా జులై అత్యంత వేడి గల నెలగా రికార్డులకెక్కినట్లు తెలుస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ దురదృష్టమైన రికార్డు చోటు చేసుకుంది. ప్రతిజారీ జులై వేడి నెలగానే వుంటుందనీ, అయితే.. ఈసారి రికార్డు స్థాయిలో ఈ నెలలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ రిక్ స్పిన్రాడ్ వెల్లడించారు. 20వ శతాబ్దానికి సంబంధించి సగటు ఉష్ణోగ్రత 60.4 డిగ్రీల ఫారన్ హీట్‌తో పోల్చితే, 1.67 ిగ్రీలు అదనంగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com