యూఏఈ అత్యున్నత ప్రభుత్వ సంస్థల వివరాల్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్

- August 14, 2021 , by Maagulf
యూఏఈ అత్యున్నత ప్రభుత్వ సంస్థల వివరాల్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్

యూఏఈ: యూఏఈ అత్యున్నత ప్రభుత్వ సంస్థల వివరాల్ని వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ అలాగే దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రకటించారు. ఫుజారియా ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ సెంటర్, అల్ బర్షా బ్రాంచ్ ఆఫ్ ది ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ దుబాయ్ ఈ పోటీలో విజేతలుగా నిలిచాయి. మొత్తం 69 ప్రభుత్వ సంస్థలపై సర్వే జరిగింది. 14 సెంటర్లు 5 స్టార్లను గెలుచుకున్నాయి. 32 కేంద్రాలు 4 స్టార్లను దక్కించుకున్నాయి. 21 సెంటర్లు మూడు స్టార్లను దక్కించుకున్నాయి. ఆరు స్టార్లతో ఫుజారియా ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ సెంటర్, అల్ బర్షా బ్రాంచ్ ఐసిఎ అగ్రస్థానంలో నిలిచాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com