టర్కీలో భారీ వర్షాలు, వరదలు..44 మంది దుర్మరణం

- August 14, 2021 , by Maagulf
టర్కీలో భారీ వర్షాలు, వరదలు..44 మంది దుర్మరణం

టర్కీ: టర్కీలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా వరదలు చుట్టుముట్టడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని సమాచారం. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగుతుంది.

వరదల కారణంగా ఇప్పటి వరకు  44 మంది చనిపోయినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారుల స్పష్టం చేశారు.

బోజ్‌కర్ట్‌ ప్రాంతంలో గత మూడు రోజుల్లో 45 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇక్కడే భారీగా ప్రాణ నష్టం జరిగింది. వరదల ధాటికి పలు అపార్టుమెంట్లు పునాదులతో సహా కొట్టుపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. వంతెనలు, రోడ్లపై బురద నిండిపోయి ఉన్నది. విద్యుత్‌ సరఫరా ఇంకా మెరుగవ్వలేదు. తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com