ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మెగాస్టార్ కి ఆహ్వానం
- August 14, 2021
హైదరాబాద్: కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైనా ఏపీలో టిక్కెట్టు ధర సమస్యాత్మకం అయిన సంగతి తెలిసిందే. సవరించిన ధరలతో ఎగ్జిబిషన్, పంపిణీ రంగాలు చిక్కుల్లో పడ్డాయి.థియేటర్ల సమస్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు.సీఎం జగన్ తో భేటీ కోసం సినీపెద్దలు ప్రయత్నిస్తున్నారని కథనాలొచ్చాయి.
ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్ చిరంజీవికి శనివారం రోజు ఫోన్ చేసి,సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సమస్య వివరిచ్చాల్సిదిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు.ఈ కీలక భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి..ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల బతుకు తెరువు సహా..పంపిణీ వర్గాల వేతనాల గురించి మాట్లాడే అవకాశం ఉంది.చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు హాజరు కానున్నారు.ఇంతకుముందు సీఎంతో భేటీ లో చిరంజీవి- నాగార్జున - రాజమౌళి- సురేష్ బాబు బృందం సమస్యలు విన్నవించగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే,అలాగే గతంలో పరిశ్రమ కు అనుకూలంగా సియం జగన్ ఎప్పుడు వరాలు ఇచ్చినా,చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన సందర్భాలున్నాయి.ఇప్పుడు ఈ భేటీ ఈ నెల చివరి వారంలో జరగనుంది,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి సమస్యకు తక్షణ పరిష్కారం చూపిస్తారనే అంతా ఆకాంక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







