మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇరువురు చైనా మహిళలకు ఐదేళ్లు జైలుశిక్ష

- March 13, 2016 , by Maagulf
మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇరువురు చైనా మహిళలకు ఐదేళ్లు జైలుశిక్ష

 ఇరువురు చైనా మహిళలు  బహెరిన్ లో ఒక రహస్య ఏజెంట్ కు  షబు విక్రయించిన నేరంలో  ఐదేళ్లు కారాగారముతో పాటు  3,000 దినార్ల జరిమానాగా విధించారు. అంతర్గత మంత్రిత్వ వ్యతిరేక మాదక శాఖ ఒక చిట్కాను ప్రయోగించింది. తొలుత వారిని సంప్రదింఛిన ఓ అధికారి  తమకు ఆ మాదక ద్రవ్యం కావాలని నమ్మకంగా  చైనా మహిళలను కోరారు. ఆ షబును అంధ చేస్తే 1000 దినార్ల ను ఇస్తానని వారికి ఆశ చూపడంతో  వారు  జుఫ్ఫిర్  ప్రాంతంలో కలవటానికి  అంగీకరించారు. వీరి కోసం సిద్ధంగా ఉన్న పోలీస్ అధికారులు అకస్మాతుగా మాదక ద్రవ్యం అందచేసే సమయానికి దాడి చేసి వారిని  అరెస్టు చేసి అదుపులోనికి తీసుకొన్నారు. వారు ఇచ్చిన వివరాల ప్రకారం మరో మహిళ  కోసం వారి అపార్ట్మెంట్ పై  దాడి చేసారు, అక్కడ ఉన్న మహిళ అసాధారణ స్థితిలో ఉంది. మాదకద్రవ్య పరీక్షలో ఆమె విఫలమైంది. కాని వీరితో కలిసి ఒకే చోట ఉంటున్నందుకు  మూడవ మహిళకు  ఆరు నెలల జైలు శిక్ష  విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com