అషురా సెలవు రోజుల్లో ఆరేంజ్ ఆలర్ట్
- August 16, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా ఈ నెల 18-19 తేదీల్లో ఆరేంజ్ అలర్ట్ విధించనున్నట్లు కోవిడ్ -19ని ఎదుర్కోవటానికి ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. అషురా సెలవు రోజులు ఉండటంతో ఆరేంజ్ అలర్ట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అవసరమైతే కొన్ని తేదీలను హైయర్ అలర్ట్ లెవల్స్ ప్రకటించొచ్చన్న మునుపటి ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ నెల 20 శుక్రవారం నుంచి తిరిగి ఎల్లో అలర్ట్ లెవల్ అమలులోకి వస్తుందని తెలిపింది.అర్హత ఉన్న 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో కనీసం 80% మంది బూస్టర్ డోస్ అందుకున్న తర్వాత అతి తక్కువ హెచ్చరిక స్థాయి అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







