టాటా చేతికి విశాఖ స్టీల్..!

- August 17, 2021 , by Maagulf
టాటా చేతికి విశాఖ స్టీల్..!

ఏపీ: ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, వైజాగ్ ఉక్కు కార్మాగారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కూడా నిర్దారించారు. విశాఖ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలోనే సముద్ర తీరాన ఉన్న అతిపెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారంగా విశాఖ ఫ్యాక్టరీ ప్రత్యేకతను చాటుకుంది. కాగా, ఈ డీల్‌కు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com