దుబాయిలోని ప్రవాస భారతీయురాలికి 'ప్రవాసి ప్రసిద్ధ మహిళ' అవార్డు ప్రధానం

- March 13, 2016 , by Maagulf

ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (అవోపా), హైదరాబాద్ శాఖ వారు వివిధరంగాల్లో విశేష సేవలందించిన మహిళలను 'ప్రసిద్ధ ఆర్య వైశ్య మహిళ' అవార్డులకు ఎంపికచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఆదివారం 13 మార్చి 2016 న హైదరాబాద్ లోని కాచిగూడ వైశ్య హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేశారు.

దుబాయిలోని  ప్రవాస భారతీయ సామాజిక సేవకురాలు శ్రీమతి అరవపల్లి వసుధ గుప్తకు 'ప్రవాసి ప్రసిద్ధ మహిళ' అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. గత 10 ఏళ్లుగా దుబాయిలో నివసిస్తున్న ఆమె వాసవి యూత్ ఎన్నారై అసోసియేషన్ లో చురుకైన సభ్యురాలు. భారతీయ సంస్కృతి గురించి ఆమె 'ప్రజ్ఞ' అనే తరగతులను నిర్వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రవాసులకు ఆమె సహాయం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com