'తోఇఫా దుబాయ్ 2016' లో సందడి చేయనున్న బాలీవుడ్ తారలు

- March 13, 2016 , by Maagulf
'తోఇఫా దుబాయ్ 2016'  లో  సందడి చేయనున్న బాలీవుడ్ తారలు

 
దుబాయ్ లో  ప్రముఖ హింది సినిమా తారలు తమ ఆటపాటలతో త్వరలో సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  తోఇఫా దుబాయ్ 2016 పేరిట  అతిపెద్ద ఉత్సవం జరగనుంది.  భారీ బాలీవుడ్ తారా ప్రముఖులు  షా రుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్, వరుణ్ ధావన్ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్ముఖ్ తదితరులతో పాటు 100 మంది కంటే ఎక్కువ మంది  బాలీవుడ్  ప్రముఖులు తమ ఉనికిని ఇక్కడ చాటనున్నారు. తోఇఫా దుబాయ్ 2016  కూటమిలో బాలీవుడ్ విశ్వవిఖ్యాత అగ్ర నటుడు, నట చిహ్నం అమితాబ్ బచ్చన్ హాజరై  తోఇఫా కు  ప్రత్యేక అదనపు ఆకర్షణ కానున్నారు.  నాణ్యతకు కమిటీ. ఈ సందర్భంగా తోఇఫా అతి ముఖ్యమైన వ్యక్తులకు మూడు స్థాయిలలో అనువైన పాకేజీలు అందిస్తోంది. తోఇఫా ఏర్పాటుతో బాలీవుడ్ తారా ప్రముఖులకు సమీపంలో కూర్చొని ఈ కార్యక్రమాలను తిలకించే అనుభూతిని పొందవచ్చు. అలాగే వారితో సంభాషించే  అవకాశం అందరికి  ఇవ్వాలని నిర్వాహకులు ఈ పాకేజీలు రూపకల్పన చేశారు .

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com