కోవిడ్ ఎఫెక్ట్: ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పై ఫైన్..సౌదీ హెచ్చరిక
- August 20, 2021
సౌదీ: విందులు, వినోదాల వంటి కార్యక్రమాలతో కుటుంబాలు, బంధువులు పెద్ద సంఖ్యలో సమావేశమైనా జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణ ప్రోటోకాల్ పరిధిలో బంధువుల సమావేశాలపై ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేసింది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లల్లో, రెస్ట్ హౌస్లు, ఫామ్ హౌజ్ లోగుమికూడితే వారిపై SR10,000 జరిమానా విధించబడుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సమావేశానికి హజరైన అతిథులకు SR5000 చొప్పున, సమావేశానికి ఆహ్వానించిన వారికి SR10,000 పెనాల్టీ విధించనున్నట్లు వెల్లడించింది. ఉల్లంఘన పునరావృతమైతే, మునుపటి సమయంలో విధించిన పెనాల్టీ రెట్టింపు అవుతుందని, గరిష్టంగా SR100,000 వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. మళ్లీ మళ్లీ నిబంధన ఉల్లంఘిస్తే జైలు శిక్ష కూడా ఎదుర్కొవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అయితే..ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







