భారత్ కరోనా అప్డేట్
- August 20, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో మరోసారి స్వల్పంగా పెరిగాయి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు…కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 36,571 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 530 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 39,157 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరగగా.. రికవరీ కేసులు 3,15,25,080కు పెరిగాయి..
ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,63,605 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.. ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండడం.. 150 రోజుల కనిష్టం కావడం విశేషం.. రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతానికి తగ్గిందని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం… మరోవైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశామని.. ఇప్పటి వరకు 50.26 కోట్ల కోవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







