మెగాస్టార్, మెహర్ రమేష్ “మెగా యుఫోరియా”
- August 21, 2021మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రాబోతోంది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయబోతున్నాం అంటూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో “గెట్ రెడీ ఫర్ మెగా యుఫోరియా” అంటూ మెగా అభిమానుల్లో జోష్ పెంచేశారు.
“చిరు 154” మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ “వేదాళం” రీమేక్ గా రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ తెలుగు రీమేక్ లో ముందుగా పవన్ నటించాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీమేక్ ను నాన్చుతునే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు. ఎట్టకేలకు ప్రాజెక్ట్ రూపొందబోతోంది.
మరోవైపు ఈ సినిమా కోసం దర్శకుడి విషయంలోనూ కాస్త టైం పట్టింది. ముందు ఈ సినిమా కోసం “సాహో” దర్శకుడు సుజిత్ ను అనుకున్నారు. ఏమైందో ఏమో కానీ సుజిత్ ని పక్కన పెట్టి సడన్ గా మెహర్ రమేష్ ఈ ప్రాజెక్టు లోకి ఎంట్రీ ఇచ్చాడు. యంగ్ డైరెక్టర్ బాబీ పేరు కూడా ఈ ప్రాజెక్టులో వినిపించింది. కానీ చిరును డైరెక్ట్ చేసే లక్ మాత్రం మెహర్ రమేష్ నే వరించింది.
మెహర్ రమేష్ కు ఈ ప్రాజెక్ట్ మెగా ఆఫర్ అని చెప్పాలి. మెహర్ రమేష్ గతంలో ప్రభాస్ తో “బిల్లా”, ఎన్టీఆర్ తో “కంత్రి”లతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన “శక్తి”, “షాడో” చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లను కూడా అందుకున్నాడు. ఆ చిత్రాల భారీగా డిజప్పాయింట్ చేయడంతో మెహర్ రమేష్ దర్శకత్వం వదిలేస్తాడు అని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మెగా ఆఫర్ ను అందుకున్నాడు. మరీ చిత్రంతోనైనా మెహర్ రమేష్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. ఈ భారీ ప్రాజెక్టును రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ రేపు రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన మిగతా అప్ డేట్స్ కూడా రేపే రానున్నాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్