మెగాస్టార్, మెహర్ రమేష్ “మెగా యుఫోరియా”
- August 21, 2021
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రాబోతోంది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయబోతున్నాం అంటూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో “గెట్ రెడీ ఫర్ మెగా యుఫోరియా” అంటూ మెగా అభిమానుల్లో జోష్ పెంచేశారు.
“చిరు 154” మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ “వేదాళం” రీమేక్ గా రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ తెలుగు రీమేక్ లో ముందుగా పవన్ నటించాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీమేక్ ను నాన్చుతునే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు. ఎట్టకేలకు ప్రాజెక్ట్ రూపొందబోతోంది.
మరోవైపు ఈ సినిమా కోసం దర్శకుడి విషయంలోనూ కాస్త టైం పట్టింది. ముందు ఈ సినిమా కోసం “సాహో” దర్శకుడు సుజిత్ ను అనుకున్నారు. ఏమైందో ఏమో కానీ సుజిత్ ని పక్కన పెట్టి సడన్ గా మెహర్ రమేష్ ఈ ప్రాజెక్టు లోకి ఎంట్రీ ఇచ్చాడు. యంగ్ డైరెక్టర్ బాబీ పేరు కూడా ఈ ప్రాజెక్టులో వినిపించింది. కానీ చిరును డైరెక్ట్ చేసే లక్ మాత్రం మెహర్ రమేష్ నే వరించింది.
మెహర్ రమేష్ కు ఈ ప్రాజెక్ట్ మెగా ఆఫర్ అని చెప్పాలి. మెహర్ రమేష్ గతంలో ప్రభాస్ తో “బిల్లా”, ఎన్టీఆర్ తో “కంత్రి”లతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన “శక్తి”, “షాడో” చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లను కూడా అందుకున్నాడు. ఆ చిత్రాల భారీగా డిజప్పాయింట్ చేయడంతో మెహర్ రమేష్ దర్శకత్వం వదిలేస్తాడు అని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మెగా ఆఫర్ ను అందుకున్నాడు. మరీ చిత్రంతోనైనా మెహర్ రమేష్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. ఈ భారీ ప్రాజెక్టును రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ రేపు రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన మిగతా అప్ డేట్స్ కూడా రేపే రానున్నాయి.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- TSRTC బంపరాఫర్: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం
- ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం
- గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- ప్రజల కోసం సలాలా గ్రాండ్ మాల్ తెరవబడింది
- షేక్ ఇబ్రహీం బిన్ మొహ్మద్ అవెన్యూ లో నూతన ట్రాఫిక్ సిగ్నల్