వలసదారుల స్వర్గధామం బహ్రెయిన్
- March 13, 2016
వలసదారుల స్వర్గధామంగా బహ్రెయిన్ అరుదైన ఘనతను సాధించింది. హాంగ్కాంగ్ అండ్ షాంగై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్ఎస్బిసి) నిర్వహించిన సర్వేలో వలసదారులు బహ్రెయిన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తేలింది. సర్వేలో 66 శాతం మంది వలసదారులు బహ్రెయిన్కి ఓటేశారు. బహ్రెయిన్ ప్రజలతో మమేకం అవడంలోనూ, బహ్రెయిన్ ప్రభుత్వం వలసదారులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలోనూ, ఉద్యోగావకాశాల విషయంలోనూ బహ్రెయిన్ వలసదారులకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇత దేశాలకు చెందినవారికి బహ్రెయిన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వీలుగా ఉంటుంది బహ్రెయిన్. ఇతర దేశాల సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవించడంలోనూ బహ్రెయిన్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విశాల దృక్పథంతో బహ్రెయిన్ పాలకులు వ్యవహరించే తీరు వలసదారుల్ని బహ్రెయిన్ ఎట్రాక్ట్ చేసేలా ఉంది. 21,950 మంది వలసదారుల అభిప్రాయం తీసుకుని, ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బహ్రెయిన్కే ఎక్కువ శాతం వలసదారులు ఓటేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







