'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల తేది దగ్గరలో..
- March 13, 2016
'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది ఈసినిమా క్రేజ్ ను పెంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలకు భిన్నంగా ఈసినిమా ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన 'సర్దార్ గబ్బర్ సింగ్' మేకింగ్ వీడియోతో పాటుగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ స్టిల్స్ ను ప్రతిరోజు విడుదల చేస్తూ ఈసినిమా పై అంచనాలు పెంచుతున్నారు. దీనితో పవన్ అభిమానులలో ఈసినిమా పై క్రేజ్ ఒక హిస్టీరియలా డెవలప్ అయింది. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదల చేసిన ఒక స్టిల్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.లేటెస్ట్ గా మీడియాకు విడుదల చేసిన ఈఫోతోలో పవన్ ఒక్కడు ఖాకీ దుస్తులు ఎర్ర రుమాలుతో కనిపిస్తుంటే మిగతా వాళ్లందరూ విచిత్రమైన డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు. కాశీ విశ్వనాథ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, నర్రా శీను, కృష్ణభగవాన్, ప్రభాస్ శీను ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. వీళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో రకమైన డ్రెస్ లో కనిపిస్తూ ఉంటే 'సర్దార్' సెట్ పై పవన్ చిరంజీవి పాటల అంత్యాక్షరితో పాటు పవన్ ఈసినిమా సెట్ పై ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టాడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ వారం జరగబోతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకకు చిరంజీవి వచ్చే విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం రాలేదు అన్న వార్తలు హడావిడి చేస్తూనే ఉన్నాయి..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







