వలసదారుల స్వర్గధామం బహ్రెయిన్‌

- March 13, 2016 , by Maagulf
వలసదారుల స్వర్గధామం బహ్రెయిన్‌

వలసదారుల స్వర్గధామంగా బహ్రెయిన్‌ అరుదైన ఘనతను సాధించింది. హాంగ్‌కాంగ్‌ అండ్‌ షాంగై బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎస్‌బిసి) నిర్వహించిన సర్వేలో వలసదారులు బహ్రెయిన్‌ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తేలింది. సర్వేలో 66 శాతం మంది వలసదారులు బహ్రెయిన్‌కి ఓటేశారు. బహ్రెయిన్‌ ప్రజలతో మమేకం అవడంలోనూ, బహ్రెయిన్‌ ప్రభుత్వం వలసదారులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలోనూ, ఉద్యోగావకాశాల విషయంలోనూ బహ్రెయిన్‌ వలసదారులకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇత దేశాలకు చెందినవారికి బహ్రెయిన్‌ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వీలుగా ఉంటుంది బహ్రెయిన్‌. ఇతర దేశాల సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవించడంలోనూ బహ్రెయిన్‌ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విశాల దృక్పథంతో బహ్రెయిన్‌ పాలకులు వ్యవహరించే తీరు వలసదారుల్ని బహ్రెయిన్‌ ఎట్రాక్ట్‌ చేసేలా ఉంది. 21,950 మంది వలసదారుల అభిప్రాయం తీసుకుని, ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బహ్రెయిన్‌కే ఎక్కువ శాతం వలసదారులు ఓటేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com