అఫ్గన్ శరణార్ధులకు మద్దతుగా బహ్రెయిన్ ఎయిర్ బేస్ ఓపెన్
- August 22, 2021
బహ్రెయిన్: అఫ్గనిస్తాన్ తాలిబన్ చెరలోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి వేల సంఖ్యలో అఫ్గన్లు దేశం విడిచి పారిపోతున్నారు. తాలిబన్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ఇతర దేశాలకు పయనం అవుతున్నారు. అయితే..ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అఫ్గన్ శరణార్ధులకు బాసటగా నిలిచేందుకు ప్రయాణ నిబంధనలను సులభతరం చేసింది బహ్రెయిన్. అఫ్గన్ శరణార్ధులు ఇతర దేశాలకు వెళ్లేందుకు వీలుగా తమ ఎయిర్ పోర్టులను వినియోగించుకోవచ్చని వెళ్లండించింది. అంటే..ముందుగా అఫ్గన్ నుంచి బహ్రెయిన్ చేరుకొని అక్కడి నుంచి వారి గమ్యస్థానానికి చేరుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు అఫ్గన్ శరణార్ధులతో వచ్చే ఫ్లైట్స్ కి బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మానవతా దృక్ఫథంతో శరణార్ధులను ఆదుకోవటం తమ నైతిక బాధ్యత భావిస్తున్నామని, అఫ్గన్ శరణార్ధుల తరలింపు సులభతరం చేయటంలో తమ నిర్ణయం దోహదపడుతుందని బహ్రెయిన్ పేర్కొంది. శరణార్ధులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే ప్రపంచ దేశాలతో కలిసి పని చేయనున్నట్లు వివరించింది. ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, దేశీయ పరిస్థితులను స్థిరీకరించడం, ప్రస్తుత పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలను కాపాడటంలో అన్ని పార్టీలు పాల్గొంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!









