హైదరాబాద్ లో ప్రారంభమైన కోవిడ్ వాక్సినేషన్

- August 23, 2021 , by Maagulf
హైదరాబాద్ లో ప్రారంభమైన కోవిడ్ వాక్సినేషన్

హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ లో 18 ఏళ్లు పై బడ్డ వారందరికీ వంద శాతం కవర్ చేసేలా చేపట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం నేడు నగర వ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభమైనది.ఇప్పటికే నగరంలో దాదాపు 50 లక్షల మందికి కరోనా వాక్సిన్ ప్రక్రియ పూర్తికాగా, ఇంకా ఇళ్లల్లో మిగిలిన వృద్దులు, మహిళలు, ఇతరులకు 100 శతం కవర్ అయ్యేటట్లుగా నేటి నుండి పదిరోజుల పాటు ఈ వాక్సినేషన్ కొనసాగనుంది.ఇంకా అవసరమైతే మరో ఐదు రోజులు పొడగించనున్నారు.ఈ వాక్సినేషన్ కార్యక్రమానికి 175 సంచార కోవిద్ వాక్సిన్ వాహనాలను ఇందుకు ఉపయోగిస్తున్నారు.నగరంలోని 4,846 కాలనీలు, బస్తీలకు ఈ మొబైల్ వాహనాలు వెళ్లి మిగిలిన వారికి వాక్సిన్ ఇస్తున్నారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆ ఇంట్లోని వారందరూ వాక్సిన్ తీసుకున్నారా అనేవిషయం వాకబు చేస్తారు. ఇంట్లోని వారందరూ వాక్సిన్ తీసుకుంటే, ఆ ఇంటికి అందరూ వాక్సిన్ తీసుకున్నారని తెలిపే స్టిక్కర్ అంటిస్తారు. ఎవరైనా మిగిలితే వారికి వాకిన్ అందచేసే సమయం, తేదీని తెలిపే స్లీప్ ను అందచేస్తారు. వాక్సిన్ ప్రత్యేక శిబిరం పూర్తికాగానే ఆయా కాలనీలు, బస్తీలో అర్హులైన వారందరికీ వాక్సిన్ పూర్తి చేసినందుకు ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులకు ప్రశంసా పత్రాన్ని అందచేస్తున్నారు.

నగర వ్యాప్తంగా నేడు ప్రారంభమైన ప్రత్యేక కోవిడ్ వాక్సిన్ కార్యక్రమాన్ని ఖైరతాబాద్ లోని సి.ఐ.బి కాలనిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజివి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యరాయణ, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జోనల్ కమీషనర్ ప్రావీణ్య లు ఈ సందర్బంగా ఉన్నారు. ఈ సందర్బంగా, సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఏ మెట్రో నగరాల్లోనూ 100 శాతం అర్హులైన వారందరికీ వాక్సిన్ ఇచ్చే ఉద్యమ కార్యక్రమాన్నిచేపట్టలేదని, కేవలం హైదరాబాద్ మహానగరంలో మాత్రమే ప్రారంభించామని వివరించారు. నగరంలోని 4,864 కాలనీలో రానున్న పది పదిహేను రోజుల్లో అందరికి వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొని విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో మూడవ విడత కరోనా వేవ్ వచ్చే అవకాశం లేదని, అయినప్పటికీ ఏవిధమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రం లో 27000 బెడ్ లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎనిమిది మెడికల్ కాలేజీల్లో బెడ్ ల సంఖ్య ను పెంచామని చెప్పారు.ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com